Share News

తోలు బొమ్మల కళాకారుడికి జాతీయ అవార్డు

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:16 AM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సిద్దయ్యగుట్టకు చెందిన తోలు బొమ్మల కళాకారుడు సిందే చిదంబరరావు జాతీయ సంగీత నాటిక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు.

తోలు బొమ్మల కళాకారుడికి జాతీయ అవార్డు

ధర్మవరం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని సిద్దయ్యగుట్టకు చెందిన తోలు బొమ్మల కళాకారుడు సిందే చిదంబరరావు జాతీయ సంగీత నాటిక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన తోలుబొమ్మల తయారీ, ప్రదర్శనలకు గానూ ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుత కాలానుగుణంగా ప్రదర్శనలు ఇస్తున్నారు. చిదంబరరావు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి అవార్డు అందుకోనున్నట్టు గురువారం ఆయన చెప్పారు.

Updated Date - Jun 12 , 2026 | 04:16 AM