పోలీసు పతక విజేతలకు డీజీపీ ప్రశంస
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:57 AM
‘వెల్ డన్ బాయ్స్.. గుడ్ జాబ్.. మీరు సాధించిన విజయాలు.. యువ పోలీసు సిబ్బందికి స్పూర్తిదాయకం’ అంటూ పోలీసు పతక విజేతల్ని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అభినందించారు.
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘వెల్ డన్ బాయ్స్.. గుడ్ జాబ్.. మీరు సాధించిన విజయాలు.. యువ పోలీసు సిబ్బందికి స్పూర్తిదాయకం’ అంటూ పోలీసు పతక విజేతల్ని డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా అభినందించారు. ఇటీవల నాగపూర్‌లో జరిగిన జాతీయ పోలీసు డ్యూటీ మీట్, అంతకుముందు జమ్మూ కశ్మీర్‌లో జరిగిన జూడో క్లస్టర్‌లో ఏపీ పోలీసు శాఖ క్రీడాకారులు 39 పతకాలు సాధించారు. స్వర్ణ, కాంస్య, రజత పతకాలు సాధించిన పోలీసులు మంగళగిరిలోని ఏపీ పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో డీజీపీ గుప్తాతో మంగళవారం భేటీ అయ్యారు. కార్యక్రమంలో ఏడీజీ మధుసూధన్ రెడ్డి, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, పోలీసు స్పోర్ట్స్ ఐజీ మోహన్ రావు, వెల్ఫేర్ డీఐజీ అన్బురాజన్ పాల్గొన్నారు.