Share News

‘ఐపీఎల్‌‘ బెట్టింగ్‌కు చెక్‌!: డీజీపీ

ABN , Publish Date - Apr 13 , 2026 | 06:36 AM

‘ఐపీఎల్‌ సీజన్‌ జోరుగా సాగుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.

‘ఐపీఎల్‌‘ బెట్టింగ్‌కు చెక్‌!: డీజీపీ

అమరావతి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘ఐపీఎల్‌ సీజన్‌ జోరుగా సాగుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ కార్యకలాపాలు రహస్యంగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్‌లైన్‌ యాప్‌లపై నిఘా పెట్టండి. లాడ్జీలు, హోటళ్లు, రహస్య ప్రాంతాలు, గ్రామాలు, తోటల్లోని స్థావరాలపైనా కన్నేయండి. బుకీలు, ఏజెంట్లను అరెస్టు చేసి, నిర్వాహకుల ఆస్తులు జప్తు చేయండి’ అని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్లను ఆదేశించారు. జిల్లాల ఎస్పీలతో డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదివారం సమీక్షించారు. బెట్టింగ్‌, జూదంపై జీరో టాలరెన్స్‌ విధానాన్ని అవలంభించాలని ఆదేశించారు. యువతను బెట్టింగ్‌కు దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీస్‌ బాస్‌ సూచించారు.

Updated Date - Apr 13 , 2026 | 06:38 AM