Share News

ఉమేశ్‌చంద్రకు డీజీ మాదిరెడ్డి నివాళులు

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:35 AM

ఏపీ క్యాడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌, డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ మంగళవారం భావోద్వేగ వాతావరణంలో ఉద్యోగ విరమణ చేశారు.

 ఉమేశ్‌చంద్రకు డీజీ మాదిరెడ్డి నివాళులు

  • సెల్యూట్‌ చేసి పదవీవిరమణ.. మంగళగిరి నుంచి తెనాలికి సైకిల్‌ యాత్ర

తెనాలి, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): ఏపీ క్యాడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌, డీజీ మాదిరెడ్డి ప్రతాప్‌ మంగళవారం భావోద్వేగ వాతావరణంలో ఉద్యోగ విరమణ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి తెనాలి సైకిల్‌పై వచ్చిన ఆయన... తన బ్యాచ్‌మేట్‌, దివంగత ఉమేశ్‌చంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సహచరునికి చివరి సెల్యూట్‌ చేసి తన పోలీసు యూనిఫామ్‌కు వీడ్కోలు పలికారు. ఉమేశ్‌తో కలసి పనిచేసిన ఆయన నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ జీవితంలో చివరి రోజున తన సహచరునికి సెల్యూట్‌ చేసిన తరువాతే యూనిఫామ్‌ విప్పాలని ఎప్పుడో నిర్ణయించుకున్నానని, ఆమేరకే ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేసి ప్రతా్‌పకు భావోద్వేగ వీడ్కోలు పలికారు.

Updated Date - Jul 01 , 2026 | 06:36 AM