పుణ్యస్నానం ఆచరిస్తూ.. నీటి గల్లంతై భక్తుడు మృతి
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:25 PM
దైవదర్శనానికి వచ్చి ఎల్లెల్సీ కాలువలో పుణ్యస్నానం ఆచరిస్తూ నీటిలో గల్లంతై ఓ భక్తుడు మృతిచెందాడు.
కౌతాళం, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): దైవదర్శనానికి వచ్చి ఎల్లెల్సీ కాలువలో పుణ్యస్నానం ఆచరిస్తూ నీటిలో గల్లంతై ఓ భక్తుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని ఉరు ుందలో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కర్నూలు పట్టణం శరీననగర్‌కు చెందిన చాకలి నరసింహ, శివమ్మ దంపతుల కుమారుడు రేవంత(19), తన పిన్ని కుమారుడు సురేష్‌తో కలిసి గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఈరన్నస్వామి దర్శనానికి వచ్చారు. స్వామి దర్శనం చేసుకుని రాత్రి అక్క డే బసచేశారు. శుక్రవారం అమావాస్య ఉండటంతో మరోసారి స్వామి దర్శనం చేసు ుందామని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే తెల్లవారు జామున ఎల్లెల్సీ కాలువలో స్నానం చేసేందుకు కాలువలో దిగాడు. ఎంతసేపటికి రేవంత బయటకు రాకపోవడంతో అక్కడ స్నానం చేస్తున్న భక్తులకు తెలుపగా వారు గాలించినా ఆచూకీ దొరకలేదు. ఉదయం 9గంటలకు కాలువలో శవమై తేలాడు. ఘటనను రేవంత తండ్రి చాకలి నరసింహులుకు తెలుపగా వారు కర్నూలు నుంచి మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. కుమారుడి మృతదేహన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌతాళం హెడ్‌కానిస్టేబుల్ దావూద్‌బాష కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆస్ప త్రికి తరలించారు.