Share News

అభివృద్ధి పథం!

ABN , Publish Date - Mar 27 , 2026 | 12:51 AM

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్రస్థాయిలో ఎకై్ౖసజ్‌శాఖ అకాడమీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్సైజ్‌ అకాడమీ హైదరాబాద్‌కే పరిమితమైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రంలో ఎక్సైజ్‌ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని కోసం 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరం. ఆ భూమి ఇక్కడ కేటాయిస్తే ఎకై్ౖసజ్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఎక్సైజ్‌శాఖకు సంబంధించి అఽధికారులు, సిబ్బందికి శిక్షణ ఇక్కడే ఇవ్వనున్నారు. ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని ఎక్సైజ్‌, భూగర్భ గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీచేశారు.

అభివృద్ధి పథం!

- మచిలీపట్నంలో ఎక్సైజ్‌ అకాడమీ

- 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటుకు చర్యలు

- భూమి సేకరించే పనిలో రెవెన్యూ అధికారులు

- రాష్ట్రస్థాయిలో శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ఇక్కడే!

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్రస్థాయిలో ఎకై్ౖసజ్‌శాఖ అకాడమీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్సైజ్‌ అకాడమీ హైదరాబాద్‌కే పరిమితమైంది. ఈ లోటును భర్తీ చేసేందుకు రాష్ట్రంలో ఎక్సైజ్‌ అకాడమీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీని కోసం 20 నుంచి 25 ఎకరాల భూమి అవసరం. ఆ భూమి ఇక్కడ కేటాయిస్తే ఎకై్ౖసజ్‌ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఎక్సైజ్‌శాఖకు సంబంధించి అఽధికారులు, సిబ్బందికి శిక్షణ ఇక్కడే ఇవ్వనున్నారు. ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన భూమిని త్వరితగతిన సేకరించాలని ఎక్సైజ్‌, భూగర్భ గనుల శాఖామంత్రి కొల్లు రవీంద్ర రెవెన్యూ అధికారులకు ఇటీవల ఆదేశాలు జారీచేశారు.

రాష్ట్ర కేంద్రంగా శిక్షణ

ఎక్సైజ్‌ విభాగంలో వివిధ కేడర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు పరీక్ష నిర్వహించిన అనంతరం ఎంపికైన వారికి శిక్షణ ఇచ్చేందుకు ఈ అకాడమీని ఏర్పాటు చేయనున్నారు. వివిధ కేడర్‌లలో ఎంపికైన ఒక్కో బ్యాచ్‌ అభ్యర్థులకు ఆరు నెలల పాటు శిక్షణ ఉంటుంది. అకాడమీలో అభ్యర్థుల శారీరక దృఢత్వం పెంపొందింపజేసేందుకు ఉదయం, సాయంత్రం సమయాల్లో రెండు, మూడు గంటల పాటు శిక్షణ ఇచ్చేందుకు పెద్ద గ్రౌండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో పాటు శిక్షణ పొందేవారికి అన్ని వసతులతో కూడిన గదులను నిర్మించనున్నారు. మెస్‌, తరగతి గదులు, అకాడమీలో శిక్షణ ఇచ్చే ప్రిన్సిపాల్‌, ఇతరత్రా సిబ్బంది, అధ్యాపకులు నివాసం ఉండేందుకు భవనాలను నిర్మిస్తారు. శిక్షణలో భాగంగా ఎక్సైజ్‌ చట్టాలను బోధించే న్యాయనిపుణుల కోసం ప్రత్యేక గదులను కూడా నిర్మాణం చేయనున్నారు. పూర్తిస్థాయిలో ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బందికి ఇక్కడే శిక్షణ ఇచ్చేలా అన్ని వసతులతో కూడిన భవనాలను నిర్మించనున్నారు.

మచిలీపట్నం నార్త్‌ మండలంలో భూమి కోసం సర్వే

ఎక్సైజ్‌ అకాడమీని మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి సేకరణకు మచిలీపట్నం నార్త్‌, సౌత మండలాలతోపాటు, గూడూరు మండలంలోనూ రెవెన్యూ అధికారులు గత మూడు రోజులుగా సర్వే చేస్తున్నారు. ఎక్సైజ్‌ అకాడమీ నిర్మాణంలో ఖర్చును తగ్గించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భూమిని సేకరించేలా రెవెన్యూ అఽధికారులు కసరత్తు చేస్తున్నారు. మచిలీపట్నం నార్త్‌ మండలంలోని కరగ్రహారం గ్రామంలో ఇప్పటికే పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటరు నిర్మాణం జరుగుతోంది. ఈ గ్రామంలో అసైన్డ్‌ లేదా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో ఎక్సైజ్‌ అకాడమీ ఏర్పాటు కోసం ఇక్కడే భూసేకరణ చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు సూచనప్రాయంగా చెబుతున్నారు. మచిలీపట్నం సౌత మండలంలోనూ భూములను అధికారులు పరిశీలించినా అక్కడ కాకుండా నార్త్‌ మండలంలోనే ఈ అకాడమీకి భూమిని సేకరించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు అంటున్నారు. కరగ్రహారంలో కాకుంటే తాళ్లపాలెం, చిరివేళ్లపాలెం తదితర గ్రామాల్లోనూ ఈ అకాడమీ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్ర తీరం వెంబడి నిఘా పెంచేందుకు జాతీయ స్థాయిలో మెరైన్‌ అకాడమీని మచిలీపట్నం నార్త్‌మండలంలోని పెదపట్నం గ్రామంలో ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నాలు చేసినా వివిధ కారణాలతో ఈ అకాడమీ చేజారింది. రాష్ట్ర స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే ఎక్సైజ్‌ అకాడమీని మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం కొంతమేర అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.

భూసేకరణకు ఆదేశాలు ఇచ్చాం

ఎకై్ౖసజ్‌ శాఖకు సంబంధించి ప్రతిష్టాత్మకమైన ఎక్సైజ్‌ అకాడమీని మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం అనువైన ప్రాంతంలో భూసేకరణ చేయాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. భూసేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం.

- కొల్లు రవీంద్ర, మంత్రి

Updated Date - Mar 27 , 2026 | 12:51 AM