Share News

ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:23 PM

ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, లలిత, ఆశోకనందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ జైన, దేవిశెట్టి ప్రకాష్‌ అన్నారు.

ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి
కుమ్మరి వీధి బహిరంగ సభలో మాట్లాడుతున్న కమిటీ సభ్యులు

ఆదోని అగ్రికల్చర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : ఆదోని జిల్లాతోనే పశ్చిమ ప్రాంత ఐదు నియోజకవర్గాల అభివృద్ధి చెందుతాయని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య, లలిత, ఆశోకనందరెడ్డి, కృష్ణమూర్తి గౌడ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌ జైన, దేవిశెట్టి ప్రకాష్‌ అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలోని కుమ్మర వీధిలో ఆదోని జిల్లా సాధన జేఏసీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్న కొంతమంది స్వార్థ నాయకులు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి జిల్లా కాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రత్త్తికొండ నియోజకవర్గ ప్రజలు ఉపాధి లేక, పంటలు పండక, వలసలు వెళుతున్నారని అన్నారు. సాగు తాగు నీరు నిధుల కేటాయింపుల్లోనూ తమ ప్రాంతాన్ని పాలకులు విస్మరించారన్నారు. ఆదోని జిల్లాతోనే అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని యువతకు ఉపాధి రైతులకు సాగు తాగునీరు విద్యా రంగ సంస్థలు వైద్య కళాశాల లభిస్తాయన్నారు. ఇలా ఆవశ్యకతపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించక పోతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు దస్తగిరి నాయుడు, రఘునాథ్‌ రెడ్డి, శిక్షావలి, రామాంజనేయులు, నారాయణస్వామి గౌడ్‌, ఉపేంద్ర, అరుణ్‌ గౌడ్‌, పవన గౌడ్‌, అయ్యాలప్ప, నరేంద్ర, రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:23 PM