Share News

అభివృద్ధే టీడీపీ ధ్యేయం

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:45 PM

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు.

   అభివృద్ధే టీడీపీ ధ్యేయం

ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర

మండల కేంద్రంలో సీసీ రోడ్లకు భూమి పూజ

తుగ్గలి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని ఉమ్మడి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన తుగ్గలి నాగేంద్ర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో తుగ్గలి నాగేంద్ర దంపతులు రాముల గుడి నుంచి బీసీ కాలనీ వరకు రూ.40 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అలాగే అలాగే రాష్ట్ర సలహా మండలి సభ్యులు వెంకటపతి, జిల్లా పరిషత మాజీ చైర్మన బత్తిన వెంకట్రాముడు రామలింగాయపల్లె ప్రధాన బస్టాండు వద్ద రూ.24 లక్షలతో రహదారి నిర్మాణ పనులకు, చెన్నంపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మీ, మార్కెట్‌ యార్డు డైరెక్టర్లు మాబాషా, తుగ్గలి రంగ, మాజీ వైస్‌ ఎంపీపీ విజయభాస్కర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:45 PM