Share News

ట్రెక్కింగ్‌కి కాదు.. బడికి!

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:36 AM

కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి దేవరబెట్ట గ్రామ కల్వర్టు రోడ్డు కొట్టుకుపోయింది.

ట్రెక్కింగ్‌కి కాదు.. బడికి!

  • కర్నూలు జిల్లా దేవరబెట్ట విద్యార్థుల నిత్య పోరాటం

  • కల్వర్టు కొట్టుకుపోవడంతో అవస్థలు

కోసిగి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లా కోసిగి మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షానికి దేవరబెట్ట గ్రామ కల్వర్టు రోడ్డు కొట్టుకుపోయింది. కోసిగి, జంపాపురం, ఆదోని ప్రాంతాలకు వెళ్లి చదువుకునే ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు రాళ్లతో నిండి అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్న దారిని అష్టకష్టాలు పడి దాటుతున్నారు. గతేడాది కూడా ఇదేవిధంగా వర్షాలకు కల్వర్టు కొట్టుకుపోగా.. తాత్కాలికంగా మరమ్మతులు చేశారు. ఎప్పుడు భారీ వర్షం కురిసినా ఇదే పరిస్థితి అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేపట్టి, ఇక్కడ శాశ్వతంగా హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించాలని వారు కోరుతున్నారు.

Updated Date - Jun 19 , 2026 | 04:37 AM