Share News

నెల్లూరు మేయర్‌గా సుజాత

ABN , Publish Date - Feb 27 , 2026 | 03:14 AM

నెల్లూరు నగర మేయర్‌గా దేవర కొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది నవంబరులో అప్పటి మేయర్‌ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.

నెల్లూరు మేయర్‌గా సుజాత

  • ఎన్నికకు దూరంగా వైసీపీ సభ్యులు

నెల్లూరు(సిటీ), ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు నగర మేయర్‌గా దేవర కొండ సుజాత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతేడాది నవంబరులో అప్పటి మేయర్‌ పొట్లూరి స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. నగరపాలక సంస్థ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్‌ను ఎన్నుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇటీవల ఆదేశించడంతో గురువారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అధ్యక్షతన సమావేశం జరిగింది. టీడీపీ బలపరిచిన 53వ డివిజన్‌ కార్పొరేటర్‌ దేవరకొండ సుజాతను మేయర్‌ అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నట్టు డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ తెలిపారు. వెంటనే బుజబుజనెల్లూరుకు చెందిన కార్పొరేటర్‌ బద్దేపూడి నరసింహగిరి బలపరుస్తున్నట్టు వెల్లడించారు. పోటీ లేకపోవడంతో సుజాతను ఏకగ్రీవంగా మేయర్‌గా ఎంపిక చేస్తున్నట్టు జేసీ ప్రకటించారు. వైసీపీ సభ్యులెవరూ ఈ ప్రత్యేక సమావేశానికి హాజరుకాకపోవడం గమనార్హం.

Updated Date - Feb 27 , 2026 | 03:14 AM