దేవాన్ష్.. ‘డైనో డీట్స్’
ABN , Publish Date - May 18 , 2026 | 04:51 AM
మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్‌కు..
యూట్యూబ్ చానల్ ప్రారంభం.. తనయుడి టీజర్‌లో భాగమైన లోకేశ్
అమరావతి, మే 17 (ఆంధ్రజ్యోతి): మంత్రి లోకేశ్ తనయుడు దేవాన్ష్ ‘డైనో డీట్స్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారా-నందమూరి కుటుంబసభ్యులు దేవాన్ష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘డైనో డీట్స్’ టీజర్‌లో మంత్రి లోకేశ్ పాలుపంచుకుని.. దేవాన్ష్ యూట్యూబ్, పాడ్ కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు. డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు-విశేషాలు, ఆకట్టుకునే శైలిలో నవ్విస్తూ, ఆలోచింపజేసేలా దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చానల్ ద్వారా వీక్షకులకు చేరనున్నాయి. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి తాను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానంటూ లోకేశ్ పేర్కొన్నారు. దేవాన్ష్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్‘గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన విషయం విదితమే. ‘5,334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్ వేగంగా పరిష్కరించాడు.