విధ్వంసం వైసీపీ సిద్ధాంతం...: మంత్రి ఆనం
ABN , Publish Date - Jan 10 , 2026 | 06:23 AM
విధ్వంసం చేయడం వైసీపీ సిద్ధాంతమని, అరాచకం సృష్టించడం జగన్ విధానమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): విధ్వంసం చేయడం వైసీపీ సిద్ధాంతమని, అరాచకం సృష్టించడం జగన్ విధానమని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రజల జీవితాలను నాశనం చేసిన జగన్, ఇప్పుడు సీమ ఉద్ధారకుడిలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ‘తిరుమలలో ఖాళీ మద్యం సీసాలు పెట్టించారు. సింహాచలం ప్రసాదంలో నత్తలు ఉన్నాయని తప్పుడు వీడియోలు చేయించారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి తెగబడతారా?’ అని మంత్రి ఆనం నిలదీశారు.