పెదపేటలో త్వరలోనే రామాలయ నిర్మాణం
ABN , Publish Date - Mar 30 , 2026 | 05:21 AM
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో తర్వలోనే రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో రఘురామ పోస్ట్
ఆకివీడు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం పెదపేటలో తర్వలోనే రామాలయం నిర్మిస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో శిల్ప, వాస్తు కళ ఉట్టిపడేలా..800 వందల ఏళ్లయినా చెక్కుచెదరని విధంగా నిర్మాణం చేపడతామని తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో దేవాలయం నమూనా చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పెదపేట మూడో రోజు కూడా పోలీసు పహారాలోనే ఉంది. శ్రీరామనమి రోజున ఆలయానికి వెళ్లిన డిప్యూటీ స్పీకర్ రఘురామ, జనసేన నేతలపై దాడిచేసిన వారికోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.