‘ఆర్‌ఆర్‌ఆర్’కు గాయం... విరిగిన మణికట్టు ఎముక
ABN , Publish Date - Feb 26 , 2026 | 05:01 AM
క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా గాయపడ్డారు.
ఆటలో అపశ్రుతి..
క్రికెట్ మ్యాచ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. క్రికెట్ ఆటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తీవ్రంగా గాయపడ్డారు. క్రికెట్ ఆటలో అదుపు తప్పి పిచ్‌పై పడిపోవడంతో చేతికి గాయమైంది. తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించగా.. ఎక్స్‌రే లో ఎడమ చేతి మణికట్టు వద్ద ఎముక విరిగినట్టు వైద్యులు గుర్తించి, ఆపరేషన్ చేయాలని సూచించారు. రఘురామ గురువారం హైదరాబాద్ వెళ్లి అక్కడ ఆపరేషన్ చేయించుకుంటారని తెలిసింది.