శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం సతీమణి
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:05 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా శనివారం సుప్రభాతసేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా శనివారం సుప్రభాతసేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు సర్జరీ జరిగిన క్రమంలో ఆమె శుక్రవారం రాత్రి అలిపిరి మార్గంలో కాలిడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి తిరుమలలోని గాయత్రి అతిథిగృహంలో బసచేసి, శనివారం వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాతసేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకోగా వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం ముందున్న అఖిలాండం వద్ద అన్నాలెజినోవా కొబ్బరికాయ కొట్టారు.