స్మగ్లర్లకు సహకరిస్తే ఉపేక్షించం: పవన్
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:43 AM
ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే.. ఎవరినీ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. కడప జిల్లా అవధూత కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో..
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలకు సహకరిస్తే.. ఎవరినీ ఉపేక్షించబోమని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హెచ్చరించారు. కడప జిల్లా అవధూత కాశినాయన మండలం వరికుంట్ల గ్రామంలో రూ.కోటిన్నర విలువైన 78 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలిపారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మల్లికార్జునుడు స్మగ్లర్లకు సహకరిస్తున్నట్లు గుర్తించి, అతడినీ వెంటనే అరెస్టు చేశామని చెప్పారు. హరియాణా, కర్ణాటక, బెంగాల్‌లో వీరికి సహకరిస్తున్న మరికొందరిని గుర్తించినట్లు తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం, భూమిలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, సీడ్ బాల్స్ పంపిణీని వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జార విడిచేందుకు మరిన్ని డ్రోన్ల సాయం తీసుకోవాలని సూచించారు.