స్థానికంలో యువనాయకత్వం బలపడాలి
ABN , Publish Date - May 26 , 2026 | 05:12 AM
జనసేన పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు తగిన వేదిక అని, ఇందుకు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులను..
జనసేన డీలిమిటేషన్ కమిటీ సభ్యులతో పవన్ కల్యాణ్
అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు స్థానిక సంస్థల ఎన్నికలు తగిన వేదిక అని, ఇందుకు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి నాయకులను, శ్రేణులను సన్నద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ తరపున స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్‌పై ఏర్పాటైన ప్రాంతీయ కమిటీల సభ్యులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. కమిటీ సభ్యులు తమ ప్రాంతాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అక్కడి వార్డుల పునర్విభజన, నాయకుల అభిప్రాయాలను నివేదిక రూపంలో పవన్‌కు అందజేశారు.