Share News

నేడు కేరళకు పవన్‌ కల్యాణ్‌

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:43 AM

వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక ఆయుర్వేద చికిత్స కోసం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

నేడు కేరళకు పవన్‌ కల్యాణ్‌

  • ఆపరేషనైన భుజానికి ఆయుర్వేద చికిత్స

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వైద్యుల సూచనల మేరకు ప్రత్యేక ఆయుర్వేద చికిత్స కోసం ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ శనివారం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు. ఇటీవల ముంబైలో కుడిభుజం రోటేటర్‌ కఫ్‌ గాయానికి ఆయన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం వైద్యులు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కానీ పాలనా బాధ్యతల దృష్ట్యా ఆయన వారం రోజుల్లోనే క్యాంపు కార్యాలయానికి అందుబాటులోకి వచ్చారు. శాఖాపరమైన విధి నిర్వహణ, విశ్రాంతి లోపం కారణం శస్త్ర చికిత్స చేయించుకున్న భుజం భాగంలో వాపు పెరిగింది. దాంతోపాటు తీవ్రమైన జ్వరం రావడంతో ఇబ్బందిపడ్డారు. వైద్యుల సూచనల మేరకు తదుపరి చికిత్సలో భాగంగా ఆయుర్వేద థెరఫీ చేయించుకోవాలని నిర్ణయించారు.

Updated Date - Aug 22 , 2026 | 04:44 AM