Share News

Sankranti Celebrations: పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవానికి పవన్‌

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:08 AM

సంక్రాంతి మహోత్సవం పేరిట డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం లో 3 రోజులపాటు పర్యటించనున్నారు.

Sankranti Celebrations: పిఠాపురంలో సంక్రాంతి మహోత్సవానికి పవన్‌

అమరావతి, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి మహోత్సవం పేరిట డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం లో 3 రోజులపాటు పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహిస్తున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. ఉదయం 10.30కు ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్‌ కళాశాల మైదానానికి చేరుకుని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. అనంతరం నియోజకవర్గ పరిధి లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాల్స్‌ను తిలకిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు.

Updated Date - Jan 08 , 2026 | 06:09 AM