నేడు జనసేన పార్లమెంటరీ పార్టీ సమావేశం
ABN , Publish Date - Jul 18 , 2026 | 05:24 AM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జనసేన పార్టీ అధ్యక్షులు..
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలు, చర్చల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో పార్టీ ఎంపీలతో ఆయన సమావేశం కానున్నారు. కాగా, కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను శుక్రవారం ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.