Share News

జల వనరుల సుస్థిరతపై నేడు వర్క్‌షాపు

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:56 AM

ఉపరితల, భూగర్భ జల వనరుల సుస్థిరతపై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో నేడు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఎస్‌ఐఆర్‌డీ)లో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు.

జల వనరుల సుస్థిరతపై నేడు వర్క్‌షాపు

  • హాజరు కానున్న ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

అమరావతి, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): ఉపరితల, భూగర్భ జల వనరుల సుస్థిరతపై గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో నేడు స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ (ఎస్‌ఐఆర్‌డీ)లో వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, అన్ని జిల్లాల ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈలు, సీఈలు హాజరవుతున్నారు. ఎస్‌ఐఆర్‌డీ మొదటి అంతస్తు నిర్మాణం పూర్తికావడంతో శిక్షణా తరగతులు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఎస్‌ఐఆర్‌డీ కమిషనర్‌ ముత్యాలరాజు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఎన్‌సీ గాయత్రి పాల్గొంటారు.

Updated Date - Apr 07 , 2026 | 04:57 AM