Share News

అడవుల రక్షణ సామూహిక బాధ్యత

ABN , Publish Date - Mar 22 , 2026 | 04:38 AM

‘అడవులు భూమాతకు ఊపిరితిత్తులు. నదులకు, జీవవైవిధ్యానికి మూలం. వాటిని రక్షించడం అంటే మన ఉనికిని రక్షించుకోవడం’ అని ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

అడవుల రక్షణ సామూహిక బాధ్యత

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ‘అడవులు భూమాతకు ఊపిరితిత్తులు. నదులకు, జీవవైవిధ్యానికి మూలం. వాటిని రక్షించడం అంటే మన ఉనికిని రక్షించుకోవడం’ అని ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఎక్స్‌ వేదికగా సందేశం ఇచ్చారు. ‘అడవులను రక్షించడం అనేది ఒక ఐచ్ఛికం కాదు.. సామూహిక బాధ్యత. ప్రభుత్వం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచాలనే దృఢ సంకల్పంతో ఉంది. ఇందులో భాగంగా మరింత పచ్చని, ఆరోగ్యకరమైన, సుస్థిరమైన భవిష్యత్‌ దిశగా ‘వన మహోత్సవం’, ‘మహా హరిత గోడ’ కార్యక్రమాల అమలు వంటి చర్యలు తీసుకుంటోందని’ పేర్కొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 04:38 AM