శాఖపై పవన్ ఫోకస్.. పనులపై సమీక్ష
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:18 AM
కుడి భుజం శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖల కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): కుడి భుజం శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన శాఖల కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇం దులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్‌లో తన నివాసంలో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పవనన్నా.. త్వరగా కోలుకోవాలి: లోకేశ్ పరామర్శ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మంత్రి లోకేశ్ పరామర్శించారు. హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కల్యాణ్‌ను లోకేశ్ శనివారం కలిసి పరామర్శించారు. పవనన్నా.. మీరు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.