మనసా, వాచా, కర్మణా..
ABN , Publish Date - Mar 29 , 2026 | 04:25 AM
‘అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధాని. అసెంబ్లీ సాక్షిగా జనసేన తరఫున మనసా, వాచా, కర్మణా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇది నానిర్ణయం.
అమరావతికి మా సంపూర్ణ మద్దతు: పవన్ కల్యాణ్
ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట
వైసీపీ వాళ్లు మళ్లీ రారు.. వచ్చినా ఏమీ చేయలేరు
హైదరాబాద్‌లాగే ఆంధ్రప్రదేశ్‌నూ అభివృద్ధి చేయాలి
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆకాంక్ష
అమరావతి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి రాష్ట్ర శాశ్వత రాజధాని. అసెంబ్లీ సాక్షిగా జనసేన తరఫున మనసా, వాచా, కర్మణా అమరావతికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇది నానిర్ణయం. సీఎం చంద్రబాబును నమ్ముతున్నాం. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. ఈ మాట మార్చం. ముందుకు తీసుకెళ్తాం’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తిస్తూ రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో డిప్యూ టీ సీఎం మాట్లాడారు. అమరావతి సాధారణ రాజధాని కాదు.. ప్రజా రాజధాని అని, ప్రపంచ శక్తిగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అని చెపా ్పరు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్‌పాటు అనేక భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. 1953 అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ప్రత్యేక ఆంధ్ర ఏర్పాటైనప్పటి నుంచి రాజధాని కోసం కొట్టుకుంటూనే ఉన్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రాజధాని అమరావతికి మెజారిటీ ప్రజలు ఇష్టంతోనే భూములిచ్చారు. 2019-24 మధ్య మన ప్రభుత్వం రాలేకపోయింది. అప్పుడు వచ్చిన ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు జరిగాయో గుర్తు తెచ్చుకుంటే బాధ కలిగిస్తుంది. మూడు రాజధానులంటూ సమస్యను మరింత జటిలం చేశారు. రాజధాని లేదు.. ఉండదని వైసీపీ ప్రభుత్వం, పోలీసులు ఎలా కొట్టారో మహిళలు జనసేన కార్యాలయానికి వచ్చి నాకు వివరించారు. నేను మద్దతుగా వెళ్తే ముళ్లకంచెలు వేశారు. యుద్ధవాతావరణం, గుబులుగుబులు వాతావరణం ఉండేది. శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు సగటు రైతులకు ఏం రక్షణ ఉంటుంది? వారి కన్నీరు ఆవేదన కలిగించింది. ఏపీ రాజధాని అమరావతేనని బలంగా కేంద్రం వద్దకు తీసుకెళ్లాం. ప్రజలు కూటమిని గెలిపించారు. ఆ మాట ఈరోజు నిలబెట్టుకుంటున్నాం’ అని తెలిపారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
విభజన బాధ్యతగా చేయలేదు..
రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏపీకి, తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేసి.. దానికనుగుణంగా ఎవరు నష్టపోతున్నారన్న విషయాన్ని గుర్తించి తర్వాత విభజన చేయాల్సింది. కానీ ఆ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదు. అమరావతి రాజధాని అని మనం చట్ట సభలో చేస్తున్న వాగ్దానం. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా కచ్చితంగా అమలు చేస్తాం. చంద్రబాబు నాయకత్వంలో అమరావతిని ఆంధప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నాం.
వాళ్లు రారు.. ఏమీ చేయలేరు..!
బయట కొంత మంది వ్యక్తులు, పెట్టుబడిదారులు మళ్లీ వైసీపీ వాళ్లొస్తే ఏదో చేస్తాన్న భ యం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్లు రారు. ఏమీ చేయలేరు. భూమి ఇచ్చిన ప్రతి రైతు, పెట్టుబడులు పెట్టేవారికి భరోసా ఇస్తున్నాం. భవిష్యత్‌లో అమరావతి రైతుల కోసం కట్టుబడి ఉంటామని జనసేన, సీఎం చంద్రబాబు కలిసి భరోసా ఇస్తు న్నాం. మనలో మనం సబ్ రీజియన్స్ పెట్టుకుంటే ముందుకు వెళ్లలేం.
కొందరికి నచ్చకపోయినా ఆయనదే ఆ క్రెడిట్..
మేం 1990లో హైదరాబాద్‌కు వచ్చాం. చూస్తూండగానే దాని రూపురేఖలు మారిపోయాయి. ప్రత్యక్షంగా చూశాను. సికింద్రాబాద్, హైదరాబాద్ ముందే ఉన్నప్పటికీ.. సైబరాబాద్ వన్‌మ్యాన్ క్రియేషన్. ఈ మాట చాలా మంది నచ్చకపోచ్చు. వాస్తవాన్ని అంగీకరించాలి. చంద్రబాబు డిజైన్ చేశారు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కతుంది. హైదరాబాద్ మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌నూ అభివృద్ధి చేయాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో పాటు రాజధాని పునర్నిర్మాణ పనులు నిరుడు మే 2న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుం చి రూ.11 వేల కోట్లు, నాబార్డు నుంచి రూ.7,387 కోట్లు సమీకరించి పనులు ప్రారంభిం చాం. రాజధానికి పెట్టుబడుల రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయ ూల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు మా వంతు సహకారం అందిస్తాం. రాష్ట్ర నిర్మాణం కోసం నిబద్ధతగా ఉం టాం. అప్పుడే పెట్టుబడులు వస్తాయి. ఈ విష యం ప్రజలకు సభాముఖంగా చెబుతున్నాను.
సాంకేతిక అడ్డంకి ఈ తీర్మానంతో తొలగిపోతుంది
అమరావతి శాశ్వత రాజధాని: మంత్రి మనోహర్
రాష్ట్ర విభజనతో జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు రైతులు అండగా నిలిచారు. రాజధాని విషయంలో రాజ్యాంగ ప్రక్రియ, అసెంబ్లీ విధానాలు పాటించకుండా వైసీపీ వ్యవహరించింది. రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై చేస్తున్న తీర్మానం చేసుకుని కేంద్రానికి పంపుతున్నాం. విభజన చట్టంలో ఉన్న ఓ సాంకేతిక అడ్డంకి ఈ తీర్మానంతో తొలగిపోతుంది. రాజధాని కోసం చేసుకుంటున్న ఈ తీర్మానం ఏ ప్రాంతానికో, కొద్ది మంది ప్రజలకో పరిమితం కాదు. రాష్ట్ర విభజన బిల్లుపై తీర్మానాన్ని వ్యతిరేకించినప్పుడు ఆనాడు నేను అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నాను ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నియంతృత్వంగా వ్యవహరించారని పేర్కొన్నాను. అమరావతిని అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చేసుకోవాలి. దీనికి చంద్రబాబు లాంటి నేతల బాధ్యతాయుతమైన నాయకత్వం అవసరం. అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపుతున్న ఈ తీర్మానానికి జనసేన తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం.