మీ నియోజకవర్గంలో మా శాఖల అభివృద్ధి ఇది..!
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:12 AM
కూటమిప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖల ద్వారా...
175 బుక్‌లెట్లు సిద్ధం చేసిన డిప్యూటీ సీఎం
తొలిగా నర్సీపట్నం ప్రతిని స్పీకర్‌కు అందజేసిన పవన్
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): కూటమిప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో నియోజకవర్గాల వారీగా పుస్తకాలను రూపొందించారు. ఆ పుస్తకాలను శుక్రవారం అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలకు అందజేశారు. తొలిగా నర్సీపట్నం నియోజకవర్గం ప్రతిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుకి ఆయన చాంబర్‌లో కలసి అందజేశారు. ‘పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో రూ.312కోట్లతో 5,628 పనులు మంజూరయ్యాయి. వాటిలో ఇప్పటి వరకు 4,530 పనులు పూర్తయ్యాయి’ అని పవన్, స్పీకర్‌కు వివరించారు.