చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:46 AM
‘స్వచ్ఛ రథాలు... రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాలను సేకరిస్తున్నాయి. వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): ‘స్వచ్ఛ రథాలు... రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాలను సేకరిస్తున్నాయి. వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 537 పాఠశాలల పరిధిలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు 576 స్వచ్ఛరథాలు పాల్గొన్నాయి. ఒక్కరోజులోనే దాదాపు లక్ష కేజీల చెత్తను సేకరించారు. ఈ వ్యర్థాల ద్వారా సుమారు రూ.11.96 లక్షల ఆదాయం లభించనుంది. ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు’ అని పవన్ పేర్కొన్నారు.