Share News

పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ

ABN , Publish Date - May 30 , 2026 | 06:08 AM

పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంపై ప్రజలు, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు.

పులి సంచారంపై నిరంతర పర్యవేక్షణ

అమరావతి, మే 29(ఆంధజ్ర్యోతి): పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంపై ప్రజలు, అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. పులి కదలికలపై ఆధునిక సాంకేతకతతో నిరంతర పర్యవేక్షణ వ్యవస్థలను అందుబాటులో ఉంచాలన్నారు. పోలవరం జిల్లా చికిలింత పంచాయతీలో పులి దాడిలో 9 దూడలు మృతి చెందటం పట్ల పవన్‌ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తిమ్మాపురం రిజర్వ్‌ ఫారెస్ట్‌లో పులి కదలికలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ పశువులు, మనుషులకు ఎలాంటి హాని కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, 24గంటలూ పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

Updated Date - May 30 , 2026 | 06:09 AM