Share News

గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:37 AM

గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌లో..

గవర్నర్‌తో డిప్యూటీ సీఎం పవన్‌ భేటీ

అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం లోక్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయిన పవన్‌ ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు, సోషల్‌ మీడియా అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం పవన్‌ ఎక్స్‌ వేదికగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Jul 04 , 2026 | 04:37 AM