Share News

డిప్యూటీ సీఎం పవన్‌ నివాళి

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:23 AM

వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్‌ నివాళి

ఇంటర్నెట్ డెస్క్: వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన ఈమేరకు పోస్టు చేశారు. భారత తొలి దళిత ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ ఘన నివాళి ఆర్పించారు.

ఈస్టర్‌ శుభాకాంక్షలు

ఈస్టర్‌ పర్వదినం సందర్భంగా క్రైస్తవ సహోదరులందరికీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు పునరుత్థానం మీ జీవితాలను నిరీక్షణతో, శాంతితో, నూతన బలంతో నింపి.. కరుణ, నీతివైపు నడిపించాలని ఆకాంక్షించారు.

Updated Date - Apr 06 , 2026 | 05:23 AM