Share News

గిరిజన సమాజాలను గౌరవించుకుందాం

ABN , Publish Date - Aug 10 , 2026 | 03:51 AM

మన ప్రాచీన సంప్రదాయాలు, గొప్ప సంస్కృతి, విజ్ఞానం, ప్రకృతితో మనకు ఉన్న గాఢమైన అనుబంధానికి రక్షకులుగా నిలిచిన మన గిరిజన సమాజాలను మనం గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని..

గిరిజన సమాజాలను గౌరవించుకుందాం

  • గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డిప్యూటీ సీఎం

అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మన ప్రాచీన సంప్రదాయాలు, గొప్ప సంస్కృతి, విజ్ఞానం, ప్రకృతితో మనకు ఉన్న గాఢమైన అనుబంధానికి రక్షకులుగా నిలిచిన మన గిరిజన సమాజాలను మనం గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘అడవి తల్లి బాట, డోలీ రహిత ఏపీ వంటి కార్యక్రమాలు, ఇతర సంక్షేమ, అభివృద్ధి చర్యల ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి గౌరవం, మంచి అవకాశాలు, అత్యవసర సేవలు అందేలా చూడటానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దేవుడి దయవల్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనుల్లో పాలుపంచుకుని, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించే అవకాశం నాకు లభించింది. గిరిజన నివాసాలకు తొలిసారిగా విద్యుత్‌ సౌకర్యం కల్పించడం, రోడ్లు, మౌలిక సదుపాయా కల్పన, అంబులెన్స్‌ , అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చూడడం వంటి పనుల ద్వారా ప్రజల దైనందిన జీవితాల్లో నిజమైన మార్పును తీసుకువచ్చే అవకాశం లభించింది. అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాలకు అభివృద్ధిని, రవాణా సౌకర్యాలను తీసుకువెళ్లడంలో సహాయపడుతున్న కేంద్ర పథకాల ద్వారా నిరంతర మద్దతు అందిస్తున్న ప్రధాని మోదీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తెలిపారు. కాగా.. ప్రముఖ కథానాయుడు మహే్‌షబాబుకు డిప్యూటీ సీఎం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Aug 10 , 2026 | 03:52 AM