పవన్ ఆరోగ్యం భేష్
ABN , Publish Date - Jul 13 , 2026 | 03:53 AM
పవన్ కల్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు.
త్వరగా కోలుకుంటున్నారు
2-3 రోజుల్లో ఫిజియోథెరపీ: ముంబై ఆస్పత్రి
ఇంటర్నెట్ విభాగం: పవన్ కల్యాణ్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను ముంబై కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి వైద్యులు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఆర్థోపెడిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ దిన్షా పార్దీవాలా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయన కుడి భుజానికి శనివారం ఉదయం సర్జరీ నిర్వహించిందని.. ఆపరేషన్ విజయవంతమైందని.. పవన్ సౌకర్యంగానే ఉన్నారని, త్వరితగతిన కోలుకుంటున్నారని వివరించారు. 2-3 రోజుల్లో ఫిజియోథెరపీ ప్రారంభిస్తామని, 4 నెలల తర్వాత భుజం పనితీరు పూర్తిగా మెరుగుపడుతుందని వెల్లడించారు.