విశాఖపై పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి: నాదెండ్ల
ABN , Publish Date - Aug 21 , 2026 | 04:46 AM
విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్ అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖ బీచ్‌రోడ్డు తీరప్రాంతాల్లో సౌకర్యాలు, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, తీర రక్షణ పనులకు సంబంధించి సీఆర్‌జడ్ అనుమతులు త్వరితగతిన పొందేందుకు తీసుకుంటున్న చర్యలేమిటని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు సీహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణ గురువారం శాసనసభలో అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానాలిచ్చారు.