Share News

నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ఆవాసాల అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:11 AM

నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ఆవాసాల అభివృద్ధికి కృషి

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): నాన్‌ షెడ్యూల్డ్‌ గిరిజన ఆవాసాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘ్‌(ఏఐబీఎ్‌సఎస్‌) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని గిరిజన ఆవాసాల్లో పల్లె పండుగ, సాస్కీ తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నందుకు వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో ఏఐబీఎస్ఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు చక్రి నాయక్‌, ప్రధాన కార్యదర్శి రాంబాబు నాయక్‌, ఉపాధ్యక్షుడు దొరస్వామి ఇతర నాయకులు పాల్గొన్నారు.

మంత్రి దుర్గేశ్‌ భేటీ..

పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్‌ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో నిడదవోలు నియోజకవర్గ పరిధిలో పల్లెపండుగ, అమరజీవి జలధార కార్యక్రమాల ద్వారా చేపట్టిన పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధికి పవన్‌ అందిస్తున్న సహకారానికి మంత్రి దుర్గేశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా పవన్‌ ఎక్స్‌లో స్పందిస్తూ... ఘనంగా నివాళి అర్పించారు.

Updated Date - Apr 15 , 2026 | 05:12 AM