సంస్థాగత నిర్మాణంపై జనసేనాని ఫోకస్
ABN , Publish Date - May 17 , 2026 | 04:23 AM
జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పత్రాల స్వీకరణ, మదింపు, కమిటీల ప్రకటన...
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పత్రాల స్వీకరణ, మదింపు, కమిటీల ప్రకటన... మొత్తం ప్రక్రియను నాలుగు వారాల్లో ముగించాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్దేశించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యులతో శనివారం పవన్ చర్చించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పత్రాలు స్వీకరణకు కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి 10 నుంచి 25 మంది సాధక్‌లు సమన్వయ బృందంగా సహకరిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల కమిటీల్లో స్థానం పొందాలి అనుకొనేవారు అందచేసే పత్రాలను ఈ కమిటీలు స్వీకరిస్తాయి. వాటిని క్రోడీకరించి, నివేదికను రూపొందించి అధ్యక్షుడికి సమర్పిస్తాయి. అధ్యక్షుడు నేతృత్వంలో ఏర్పాటయ్యే కమిటీ ఆ నివేదికలను పరిశీలించి నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కమిటీల్లో సభ్యులను నియమిస్తుంది.