క్షమాపణలు చెప్పిన పవన్ అభిమానులు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:47 AM
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే పుస్తకాన్ని శనివారం..
తిరుమల, జూన్ 14(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ‘పవన్ కల్యాణ్ అనే నేను’ అనే పుస్తకాన్ని శనివారం శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద ఇద్దరు యువకులు, ఓ వృద్ధురాలు ప్రదర్శించి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్రమంలో భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురూ ఆదివారం మరో వీడియోను విడుదల చేశారు. అందులో.. ‘మేము చేసిన తప్పునకు క్షమాపణలు చెబుతున్నాం’ అని పేర్కొన్నారు.