యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది: పవన్
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:35 AM
ఉగాది పర్వదినాన రాష్ట్ర యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించి మా కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ఉగాది పర్వదినాన రాష్ట్ర యువత కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటించి మా కూటమి ప్రభుత్వం తీయటి కబురు చెప్పింది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్‌పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మొత్తంగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. నిర్దేశిత సమయంలో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం యువత ఆకాంక్షలను మనసుతో అర్థం చేసుకుంటోంది. ఈ 20 నెలల కాలంలో 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. ఉపాధ్యాయ, కానిస్టేబుల్ పోస్టులకి ఎంపికైన వారికి నియామకపత్రాలు అందించినప్పుడు వారి కళ్లలో ఆనందం చూశాం’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.