అవార్డులు సాధించిన పంచాయతీలకు, సర్పంచ్‌లు, అధికారులకు అభినందనలు
ABN , Publish Date - May 11 , 2026 | 04:46 AM
స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా..
సీఎం చంద్రబాబుకు కూడా: పవన్ కల్యాణ్
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్న దృఢ సంకల్పంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కేంద్రం గుర్తించిందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపా రు. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025, నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ పురస్కార్-2025 అవార్డు ల్లో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి రెండో స్థానం దక్కడం గర్వకారణమని ఆదివారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. అన్ని విధాలుగా సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.