Share News

గ్రామం నుంచి గ్లోబల్‌కు

ABN , Publish Date - Feb 15 , 2026 | 03:57 AM

గ్రామం నుంచి గ్లోబల్‌ స్థాయి వరకూ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత..

గ్రామం నుంచి గ్లోబల్‌కు

  • 360 డిగ్రీల గ్రోత్‌ మోడల్‌ బడ్జెట్‌

  • అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం

  • సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు: పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): గ్రామం నుంచి గ్లోబల్‌ స్థాయి వరకూ.. విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత.. ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే 360 డిగ్రీల సమతుల్య గ్రోత్‌ మోడల్‌గా రాష్ట్ర బడ్జెట్‌ రూపుదిద్దుకుందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర బడ్జెట్‌పై ‘ఎక్స్‌’ వేదికగా ఆయన స్పందించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు అందిస్తున్నామన్నారు. ‘చంద్రబాబు నేతృత్వంలో 360 డిగ్రీల్లో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బలమైన పునాది వేసేలా.. రూ.3.22 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.22,942 కోట్ల కేటాయింపులు జరపడం ద్వారా రాష్ట్రాభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకమనే విషయాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు 714 కోట్లు కేటాయించింది’ అని చెప్పారు.

Updated Date - Feb 15 , 2026 | 04:00 AM