శ్రీవారి సేవలో పవన్, లోకేశ్
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:47 AM
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు.
తిరుమల, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. లోకేశ్ ఉదయం బ్రేక్ దర్శన సమయంలో స్వామిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో లోకేశ్‌ను వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి కుమార్తె వివాహానికి లోకేశ్ హాజరయ్యారు. పవన్ కల్యాణ్ శ్రీవాణి ట్రస్టు సేవ ద్వారా సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదించగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలు అందజేశారు.