Share News

Deputy CM Fundus Blood Bank: డిప్యూటీ సీఎం సొంత నిధులతో అరకు లో బ్లడ్‌ బ్యాంకు

ABN , Publish Date - Jan 09 , 2026 | 05:51 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో బ్లడ్‌ బ్యాంకు భవన నిర్మాణానికి గురువారం కలెక్టర్‌ ఎ.ఎ్‌స.దినేశ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు....

Deputy CM Fundus Blood Bank: డిప్యూటీ సీఎం సొంత నిధులతో అరకు లో బ్లడ్‌ బ్యాంకు

  • భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కలెక్టర్‌

అరకులోయ, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రాంతీయ ఆస్పత్రి ప్రాంగణంలో బ్లడ్‌ బ్యాంకు భవన నిర్మాణానికి గురువారం కలెక్టర్‌ ఎ.ఎ్‌స.దినేశ్‌కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సొంత నిధులు రూ.95 లక్షలు మంజూరు చేశారని ఈ సందర్భంగా కలెక్టర్‌ తెలిపారు. అన్ని సదుపాయాలతో తొమ్మిది నెలల్లో ఈ భవనాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. సొంత నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎంకు ఈ ప్రాంత గిరిజనుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.

Updated Date - Jan 09 , 2026 | 05:51 AM