ఎస్సీ, ఎస్టీ ఆంత్రపెన్యూర్స్ సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Jul 08 , 2026 | 05:01 AM
ఎస్సీ, ఎస్టీ ఆంత్రపెన్యూర్స్(పారిశ్రామికవేత్తల) సమస్యల పరిష్కారానికి తక్షణ కార్యాచరణ చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హామీ
అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ ఆంత్రపెన్యూర్స్(పారిశ్రామికవేత్తల) సమస్యల పరిష్కారానికి తక్షణ కార్యాచరణ చేపడతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన ఎస్సీ, ఎస్టీ ఆంత్రపెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రతి సమస్యనూ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.
టీడీపీ కార్యాలయం ఎదుట నిరసన
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించిన సబ్సిడీలు 2021 నుంచి పెండింగ్‌లో ఉన్నాయని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయం ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ‘రూ.730 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్సిడీలు వెంటనే విడుదల చేయాలి. సబ్సిడీలు అందక రాష్ట్రవ్యాప్తంగా 8500 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.