రేపు డీఈవో, ఏపీసీల సదస్సు
ABN , Publish Date - May 19 , 2026 | 06:01 AM
డీఈవోలు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలతో విద్యాశాఖ బుధవారం సచివాలయంలో సదస్సు నిర్వహిస్తోంది.
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): డీఈవోలు, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు సమన్వయకర్తలతో విద్యాశాఖ బుధవారం సచివాలయంలో సదస్సు నిర్వహిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. జిల్లాల్లో పాఠశాలల స్థితిగతులు, ప్రభుత్వ పాఠశాలల పురోగతి, ఇతరత్రా అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఒక్కో డీఈవోకు పది నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్తులో విద్యారంగం బలోపేతంపై మంత్రి పలు సూచనలు చేయనున్నారు.