Share News

పొగమంచుతో బహుపరాక్‌!

ABN , Publish Date - Feb 04 , 2026 | 04:39 AM

మధ్య భారతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది.

పొగమంచుతో బహుపరాక్‌!

  • పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక

విశాఖపట్నం, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): మధ్య భారతంలో కొనసాగుతున్న అధికపీడనం ప్రభావంతో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణతో పాటు కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, గుంటూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పొగమంచు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా తెల్లవారుజామున వాహనాలు నడిపేవారంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా, పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అటూఇటుగా నమోదవుతాయని పేర్కొంది.

Updated Date - Feb 04 , 2026 | 04:40 AM