కోస్తాలో దట్టంగా పొగమంచు
ABN , Publish Date - Jan 21 , 2026 | 03:59 AM
కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మంచు ఎక్కువగా ...
వంద మీటర్ల కంటే తక్కువగా విజిబులిటీ
మరో 2 రోజులు ఉంటుందన్న వాతావరణ కేంద్రం
విశాఖపట్నం, జనవరి 20(ఆంధ్రజ్యోతి): కోస్తాలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉదయం దట్టంగా పొగమంచు కురిసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మంచు ఎక్కువగా కురిసిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉదయం విజిబులిటీ వంద మీటర్ల కంటే తక్కువగా నమోదైందని పేర్కొంది. మరో రెండు రోజులపాటు తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ పొగమంచు కురుస్తుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది నుంచి చలిగాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో కనీస ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అరకులోయలో 5.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు, మూడు రోజులు చలి తీవ్రత ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.