Share News

Visakhapatnam: రాష్ట్రంలో కొనసాగుతున్న మంచు

ABN , Publish Date - Jan 03 , 2026 | 05:39 AM

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ మంచు కురిసింది.

Visakhapatnam: రాష్ట్రంలో కొనసాగుతున్న మంచు

విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకూ మంచు కురిసింది. దీంతో ఉదయం పూట వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ ఎయిర్‌పోర్టులో విజిబిలిటీ 800 మీటర్లకు పడిపోయింది. అయితే సముద్రం మీదుగా తూర్పుగాలులు వీస్తుండడంతో తేమ వల్ల మేఘాలు ఆవరించి చలి స్వల్పంగా తగ్గింది. కాగా శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అయితే దీని ప్రభావం రాయలసీమ, కోస్తాపై ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో మంచు కురుస్తోందని, చలి ప్రభావం ఒక మోస్తరుగా ఉంటుందని పేర్కొంది.

Updated Date - Jan 03 , 2026 | 05:39 AM