Weather Alert: మంచుకురిసే వేళలో..
ABN , Publish Date - Jan 18 , 2026 | 05:40 AM
ఏలూరు జిల్లాను శనివారం మంచు దుప్పటి కప్పేసింది. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉదయం 10గంటల వరకు మంచు కొనసాగడంతో వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది.
ఉదయం 10 గంటల వరకు పొగమంచు
అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
ఏలూరు జిల్లాను శనివారం మంచు దుప్పటి కప్పేసింది. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఉదయం 10గంటల వరకు మంచు కొనసాగడంతో వాహనాల రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేకువజామునే వచ్చిన భక్తులు చలికి గజగజలాడారు. ఏజెన్సీ మండలాల్లో పక్కనున్న వ్యక్తి కనిపించనంతగా పొగమంచుతో కూడిన సన్నటి మంచుతుంపర కురిసింది. కలపర్రు టోల్‌ప్లాజా వద్ద ఉదయం 9గంటల సమయంలోనూ వాహనదారులు లైట్ల వెలుగుల్లో రాకపోకలు సాగించారు. ఏలూరు, ఉభయ గోదావరి, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల విజిబులిటీ 100 మీటర్ల కంటే తక్కువగా నమోదైంది. తెల్లవారుజామున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం సూచించింది. మధ్య భారతం నుంచి వీస్తున్న అతిశీతల గాలులతో కోస్తాలో చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు 3నుంచి 4డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో 3.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజుల్లో పొగమంచు, చలి తీవ్రత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
- ద్వారకా తిరుమల/బుట్టాయగూడెం/విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి