Share News

పోలీస్‌ పాత క్వార్టర్స్‌ కూల్చివేతకు అనుమతి

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:00 AM

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసు కుటుంబాల నివాసం కోసం దశాబ్దాల క్రితం నిర్మించిన పాత క్వార్టర్స్‌ కూల్చివేతకు ప్రభుత్వం పోలీసు శాఖకు అనుమతిచ్చింది.

పోలీస్‌ పాత క్వార్టర్స్‌ కూల్చివేతకు అనుమతి

అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పోలీసు కుటుంబాల నివాసం కోసం దశాబ్దాల క్రితం నిర్మించిన పాత క్వార్టర్స్‌ కూల్చివేతకు ప్రభుత్వం పోలీసు శాఖకు అనుమతిచ్చింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో శిథిలావస్థలో ఉన్న 1403 పోలీస్‌ క్వార్టర్స్‌ కూల్చివేతకు పోలీసు శాఖ ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. పరిశీలించిన ప్రభుత్వం కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్‌తో పాటు ఏలూరు, గుంటూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని 483 క్వార్టర్ల కూల్చివేతకు అనుమతిచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎస్‌టీసీఎల్‌కు ఈ బాధ్యతలు అప్పగించి వాటిని కూల్చి వేయించేందుకు డీజీపీ చర్యలు చేపట్టాలని హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Updated Date - Jan 23 , 2026 | 05:17 AM