Share News

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:14 AM

అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని అంగన్‌వాడీ అనుబంధ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అంగన్‌వాడీల సమస్యలు పట్టవా?

విజయవాడ, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని అంగన్‌వాడీ అనుబంధ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఇక్కడి సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో, అంగన్వాడీ హెల్పర్స్‌ అసోసియేషన్‌(సీఐటీయూ)రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు సుప్రజ మాట్లాడుతూ ‘కేంద్ర ప్రభుత్వ పథకాలతో అంగన్వాడీలపై పని భారం పెరిగినా వేతనాలు మాత్రం పెరగలేదు. అంగన్వాడీ ఉద్యోగులకు తగిన వేతనాల పెంపు, పెండింగ్‌ బకాయిల చెల్లింపు, ఖాళీల భర్తీ, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలి.. అని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 23న విజయవాడలో నిర్వహించే ధర్నాకు అంగన్‌వాడీలు తరలిరావాలంటూ కరపత్రాలు ప్రదర్శించారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి లలిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 03:14 AM