గృహ నిర్మాణ సంస్థ సిబ్బందిని రెగ్యులర్ చేయాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 03:56 AM
రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న చిన్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎన్‌ఎంఆర్...
ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల రాష్ట్ర సంఘం డిమాండ్
అమరావతి, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న చిన్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎన్‌ఎంఆర్, మినిమమ్ టైం స్కేలు ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.సుధాకరరావు ప్రభుత్వాన్ని కోరారు. సంస్థలో 38 సంవత్సరాల సర్వీసు ఉన్న నాలుగో తరగతి, వివిధ చిన్న క్యాడర్లలో పనిచేస్తున్న ఎన్‌ఎంఆర్, మినిమమ్ టైంస్కేలు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు.