బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:05 AM
బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మారేష్
విజయవాడ (గాంధీనగర్), జనవరి 27 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్.మారేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన బీసీ సంఘాల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మారేష్ మాట్లాడుతూ బీసీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులతో సంబఽంధం లేకుండా నేరుగా రుణాలు అందజేయాలని కోరారు.